Eto Vellipoyindhi Manasu : రామలక్ష్మి దొంగతనం చేసి ఉంటుంది.. నాపై మాత్రం ఎవరికి డౌట్ రాలేదు!
on Jul 2, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -137 లో.. రామలక్ష్మి బీరువా కీస్ ఎక్కడ పెట్టానోనని చూస్తుంటుంది. ఇక్కడ పడేసావంటూ సీతాకాంత్ కీస్ ఇస్తాడు. నేను టేబుల్ పైన పెట్టాను.. అక్కడికి ఎలా వెళ్లాయంటూ డౌట్ పడుతూ రామలక్ష్మి బీరువా దగ్గరికి వెళ్లి చూసేసరికి నగలుండవు. దాంతో రామలక్ష్మి టెన్షన్ పడుతుంటే.. ఏమైందని సీతాకంత్ అడుగుతాడు. నగలు లేవని రామలక్ష్మి చెప్పగానే సీతాకాంత్ ఆశ్చర్యపోతాడు.
దొంగతనం జరిగి ఉంటుంది. అందుకే కీస్ నేను పెట్టిన చోట లేవని రామలక్ష్మి అంటుంది. ఏం జరిగిందో తెలుసుకుందాం.. నువ్వు టెన్షన్ పడకని సీతాకాంత్ అంటాడు. ఆ తర్వాత కిందకి వచ్చి అందరికి.. ఆ విషయం చెప్పగానే అందరు షాక్ అవుతారు. రాత్రి రామలక్ష్మి బీరువా లో పెట్టింది. ఇప్పుడు చూస్తే నగలు లేవని సీతాకాంత్ అనగానే.. అలా ఎలా జరుగుతుందని శ్రీలత అంటుంది. సందీప్ మాత్రం టెన్షన్ పడుతుంటాడు. నేను ఇలా దూరంగా ఉంటే నా మీద డౌట్ వస్తుందని సందీప్ అనుకుంటాడు. దొంగతనం ఎవరు చేసారనది పోలీస్ కంప్లైంట్ ఇస్తే తెలుస్తుందని సీతాకాంత్ అనగానే దొంగతనం ఇంట్లో వాళ్లే చేసారని పెద్దాయన అంటాడు. ఆ తర్వాత రామలక్ష్మి దొంగతనం చేసే రకం కాదు కానీ దొంగతనం తనే చేసింది అనుకునేలా చెయ్యాలని శ్రీవల్లికి శ్రీలత చెప్తుంది. దాంతో శ్రీవల్లి దొంగతనం రామలక్ష్మి చేసి ఉంటుంది అనగానే.. అందరు షాక్ అవుతారు. అవును నేను చెప్పింది నిజమే ఇదిగో సాక్ష్యం కూడా ఉందని మాణిక్యానికి రామలక్ష్మి డబ్బులు ఇస్తున్న వీడియో సీతాకాంత్ కి చూపిస్తుంది. అందులో డబ్బులు ఇస్తున్నట్లు ఉంది. బంగారం ఇచ్చినట్లు ఎక్కడ ఉందని సీతాకాంత్ అంటాడు. మరి ప్రొద్దున అంత సీక్రెట్ గా ఎందుకు మాట్లాడుతుందని శ్రీవల్లి అంటుంది.
నువ్వు అర్ధం లేకుండా మాట్లాడకు.. మాణిక్యాన్ని అమ్మ ఇంట్లోకి వద్దని చెప్పింది.. అందుకే బయట మాట్లాడుకున్నారని సీతాకాంత్ అంటాడు. మా నాన్న తాగడానికి డబ్బులు కావాలన్నాడు అందుకే డబ్బులు ఇచ్చాను. నేను దొంగతనం చెయ్యలేదని రామలక్ష్మి అంటుంది. అప్పుడు అన్ని వేళ్ళు రామలక్ష్మి వంకే చూస్తున్నాయ్.. ఎందుకంటే లాకార్ కీస్ తన దగ్గరే ఉన్నాయని శ్రీలత అంటుంటే.. సీతాకాంత్ మౌనంగా ఉంటాడు. నాపై మాత్రం ఎవరికి డౌట్ రాలేదని సందీప్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Also Read